ఒక పత్రికా విలేఖరి ఒక రైతును ఇంటర్ వ్యూ చేస్తున్నాడు.
' మీరు మీ మేకకు ఏంపెడతారు?'
రైతు: ' నల్లమేకకా, తెల్లమేకకా?'
వి: ' నల్లమేకకు.'
రై: ' గడ్డి.'
వి: ' మరి తెల్లమేకకు?'
రై: ' గడ్డి.'
వి: ' మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు?'
రై: నల్లమేకనా, తెల్లమేకనా?'
వి: నల్లమేకను.
రై: బయటి వసారాలో.
వి: మరి తెల్లమేకను?
రై: దాన్ని కూడా బయటి వసారాలో.
వి: వీటికి స్నానం ఎలా చేయిస్తారు?
రై: నల్లమేకకా, తెల్లమేకకా?
వి: నల్లమేకకు.
రై: నీటితో.
వి: మరి తెల్లమేకకు?
రై: దానికి కూడా నీటితో.
వి: నీకసలు బుధ్ధి వుందా? రెండిటికీ ఒకేలా చేస్తున్నప్పుడు..అస్తమానూ నల్లమేకకా, తెల్లమేకకా అని ఎందుకడుగుతున్నావు?
రై: ఎందుకంటే నల్లమేక నాది.
వి: మరి తెల్లమేక?
రై: అదికూడా నాదే.
... విలేఖరి తల గోడకేసి కొట్టుకున్నాడు.
రైతు నవ్వుతూ అన్నాడు, ' ఇప్పుడర్థమైందా,మీరు టి.వి.లో ఒకే వార్త తిప్పి తిప్పి గంటలు గంటలు చూపిస్తూంటే మా ప్రేక్షకులకి ఎలా వుంటుందో?'....

No comments:
Post a Comment